విజయంపై వందశాతం నమ్మకం ఉంది :రోషన్

 విజయంపై వందశాతం నమ్మకం ఉంది :రోషన్

రోషన్, అనస్వర రాజన్‌‌‌‌ జంటగా ప్రదీప్ అద్వైతం రూపొందించిన  పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’. అశ్వినీదత్,  జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు నిర్మించాయి.  డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌‌‌‌లో భాగంగా ఆదివారం  వైజాగ్‌‌‌‌లో ఛాంపియన్ నైట్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ ‘వైజయంతిలో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తు న్నా.  దత్ గారు లెజెండరీ ప్రొడ్యూసర్. ఎంతో మంది స్టార్  హీరోలను ఆయన పరిచయం చేశారు.

నన్ను కూడా ‘ఛాంపియన్’ ద్వారా తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది.  మొన్నటివరకు  టెన్షన్‌‌‌‌గా ఉన్నా..  ట్రైలర్ వచ్చిన తర్వాత, ఎడిట్ చూసిన తర్వాత వంద శాతం హిట్ కొడతామని నమ్మకం వచ్చేసింది’ అని అన్నాడు.  టాప్ బ్యానర్‌‌‌‌‌‌‌‌ ద్వారా తెలుగు ఆడియెన్స్‌‌‌‌కు పరిచయం కావడం హ్యాపీగా ఉందని అనస్వర రాజన్ చెప్పింది. ఈ చిత్రంలో మైఖేల్‌‌‌‌గా రోషన్ అందర్నీ  మెప్పిస్తాడని ఊహ అన్నారు. రామ్ మిరియాల, కాసర్ల శ్యామ్,   రచ్చ రవి తదితరులు పాల్గొని సినిమాను  సక్సెస్ చేయాలని కోరారు.