ఆడపిల్లల ఆలోచనలపై బ్యాడ్‌‌‌‌ గాళ్స్‌‌‌‌

 ఆడపిల్లల ఆలోచనలపై బ్యాడ్‌‌‌‌ గాళ్స్‌‌‌‌

అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌‌‌‌లో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేమ్  ఫణి ప్రదీప్ ధూళిపూడి  రూపొందించిన   చిత్రం ‘బ్యాడ్‌‌‌‌ గాళ్స్‌‌‌‌’.  కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్‌‌‌‌లైన్.  రేణూ దేశాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.  శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మించారు.   క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది. సోమవారం  ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేసిన   దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘ట్రైలర్ ప్రామిసింగ్‌‌‌‌గా ఉంది. 

దర్శకుడు ఫణి నా చిరకాల మిత్రుడు. ఇండస్ట్రీలో సాధు జీవి, మంచి సంగీత జ్ఞానం ఉన్నవాడు. ఇప్పుడు ఒక మంచి విషయాన్ని  కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు, ఆడవారికి ఇంపార్టెన్స్  ఇచ్చే సినిమా తప్పకుండా ఆడాలి. ఈనాటి ఆడపిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు అనే కాన్సెప్ట్‌‌‌‌తో తీసిన చిత్రమిది’ అని అన్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్‌‌‌‌ని ఇస్తుందని, అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ గారి లిరిక్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని డైరెక్టర్ ఫణి ప్రదీప్ చెప్పాడు.