నారీ నారీ నడుమ నవ్వుల మురారి

 నారీ నారీ నడుమ  నవ్వుల మురారి

శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు తెరకెక్కించిన చిత్రం ‘నారీ  నారీ నడుమ మురారి’.  సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్స్‌‌‌‌. సోమవారం ఓ ఇంజనీరింగ్ కాలేజ్‌‌‌‌లో ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేశారు. టీజర్ కంటెంట్ విషయానికొస్తే.. ఆఫీస్‌‌‌‌లో సాక్షివైద్యను లవ్ చేసిన హీరో శర్వా తనతో పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో అతని మాజీ ప్రియురాలు సంయుక్త టీమ్‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌గా ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ చిత్ర  ప్రధాన కథ. నారి  నారి నడుమ చిక్కుకుపోయిన మురారిగా శర్వా నటన ఇంప్రెస్‌‌‌‌ చేస్తోంది.  

‘సామజవరగమన’తో హిట్‌‌‌‌ అందుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజు... మరోసారి ఫ్యామిలీ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో హిలేరియస్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా దీన్ని తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. వీకే నరేష్, వెన్నెల కిషోర్,  సత్య, సునీల్, సుదర్శన్‌‌‌‌ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించారు. జ్ఞానశేఖర్ వీఎస్, యువరాజ్ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్‌‌‌‌ ఆకట్టుకున్నాయి. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్‌‌‌‌తో కలిసి ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌‌‌‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 14న సాయంత్రం షోతో థియేటర్స్‌‌‌‌కు వస్తోంది.