ఈజీఎస్ నుంచి గాంధీ పేరు తొలగింపును నిరసిస్తూ ర్యాలీలు : మంత్రి సీతక్క

ఈజీఎస్ నుంచి గాంధీ పేరు తొలగింపును నిరసిస్తూ ర్యాలీలు :  మంత్రి సీతక్క
  • ఈ నెల 27 లేదా 28 తేదీల్లో కార్యక్రమాలు: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 27 లేదా 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు, వార్డు సభ్యులతో ర్యాలీలు నిర్వహిస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. సోమవారం గాంధీ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన ఈ పథకానికి తాము వ్యతిరేకమని, ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలంటూ గ్రామాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పారు. 

ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తే గ్రామాల్లో కూలీలకు ఉపాధి ఉండదని, దీంతో ఆ కూలీలు తక్కువ రేట్లకే కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేందుకు మొగ్గు చూపుతారని, ఇది కేంద్రం పన్నుతున్న కుట్ర అని ఆమె మండిపడ్డారు. దేశంలో ఉపాధి హామీ చట్టాన్ని తీసేసి, మళ్లీ వెట్టి చాకిరి విధానాన్ని తీసుకురావాలని బీజేపీ ఆలోచిస్తున్నదని సీతక్క ఆరోపించారు.