చిన్న నిర్మాతలు ఆలోచించి ముందుకెళ్లాలి : ఆర్కే గౌడ్

చిన్న నిర్మాతలు ఆలోచించి ముందుకెళ్లాలి : ఆర్కే గౌడ్

ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ఆర్కే దీక్ష’.  కిరణ్ హీరోగా అక్సా ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్‌‌‌‌గా నటించారు.  తులసి, అనూష, కీర్తన,  ప్రవల్లిక, రోహిత్ శర్మ  కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం  త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌ను  నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ రిలీజ్ చేసి సినిమా సక్సెస్ సాధించాలని అన్నారు.  

ఈ సందర్భంగా దర్శక నిర్మాత  రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘అన్న ఎన్టీఆర్ గారు 50 సంవత్సరాల క్రితం చేసిన దీక్ష అనే టైటిల్‌‌‌‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడం గర్వంగా అనిపిస్తుంది. చిన్న సినిమాలకు భారంగా ఉన్న డిజిటల్ చార్జెస్‌‌‌‌ను తగ్గించాలని కోరుకుంటున్నా.  ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న నిర్మాతలు ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి’ అని అన్నారు. నటులు కిరణ్, అక్సా ఖాన్, తులసి, సమర్పకులు డి.ఎస్.రెడ్డి, నిర్మాతలు  గురు రాజ్,   సాయి వెంకట్ పాల్గొన్నారు.