
హైదరాబాద్: హైఎండ్ కార్లను విక్రయిస్తున్న బష్రత్ ఖాన్ ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. శుక్రవారం(సెప్టెంబర్ 26) బష్రత్ ఖాన్ కు చెందిన జూబ్లీహిల్స్ నివాసం, గచ్చిబౌలిలోని షోరూంలో ఏకకాలంలో ఈడీ సోదాలు చేపట్టింది. ల్యాండ్ క్రూజర్లు అక్రమ ఇంపోర్ట్ కేసులో మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ తనిఖీలు చేసింది.మనీలాండరింగ్ జరిగిందనే దానిపై ఈడీ అధికారులు సోదాలునిర్వహించారు.
గచ్చిబౌలిలో SK కార్ లాంజ్ పేరుతో షోరూం ఏర్పాటు చేసి లగ్జరీ కార్లను విక్రయిస్తున్న బష్రత్ ఖాన్ ను గతంలో DRI అధికారులు అరెస్ట్ చేశారు. లక్జరీ కార్లను అక్రమంగా విదేశాలనుంచి దిగుమతి చేశారని.. విదేశాలకు చెందిన 30 ఖరీదైన కార్లను విక్రయించి పెగా నిబంధనలు ఉల్లంఘించి రూ. 100 కోట్ల కస్టమర్స్ పన్ను ఎగవేత కేసులో బష్రత్ ఖాన్ ను DRI అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా శుక్రవారం ఈడీ అధికారులు బష్రత్ ఖాన్ ఇల్లు, షోరూంలో తనిఖీలు చేశారు.
మే 15న గచ్చిబౌలిలోని కార్ లాంజ్ షోరూమ్ యజమాని, నగరానికి చెందిన వ్యాపారవేత్త బషరత్ ఖాన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అరెస్టు చేసింది. హై-ఎండ్ లగ్జరీ కార్ల దిగుమతికి సంబంధించి దాదాపు రూ.100 కోట్ల భారీ కస్టమ్స్ సుంకం ఎగ్గొట్టినట్లు ఆరోపించింది.
ఓడరేవులలో ఉద్దేశపూర్వకంగా తక్కువ ఇన్వాయిస్‌లు తప్పుగా చూపించడం ద్వారా లగ్జరీ వాహనాలను దాదాపు 50 శాతం తక్కువ విలువతో భారతదేశంలోకి దిగుమతి చేసుకున్నట్లు DRI కనుగొంది.