జూన్ 19 నుంచి ఓటీటీలోకి ఎమ్ ఫర్ ఎమ్

జూన్ 19 నుంచి ఓటీటీలోకి ఎమ్ ఫర్ ఎమ్

మోహన్ వడ్లపడ్ల దర్శక నిర్మాతగా  రూపొందించిన చిత్రం  ‘ఎమ్ ఫర్ ఎమ్’ (మోటివ్ ఫర్ మర్డర్).  ఒడిశా సూపర్ స్టార్ సంబీట్ ఆచార్య, అమెరికన్ హీరోయిన్ జో శర్మ జంటగా నటించిన ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలైంది.

ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్  జూన్ 19 నుంచి లయన్స్‌‌‌‌గేట్ ప్లేలో  ప్రీమియర్ కానుందని ప్రకటించారు. సీరియల్ కిల్లర్ చుట్టూ ఈ కథ సాగుతుంది.  శుభలేఖ సుధాకర్, సత్యకృష్ణన్, గీతా భాస్కర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ చిత్రం లయన్స్‌‌‌‌గేట్ ప్లే ద్వారా మరింత మంది ప్రేక్షకులకు చేరువవుతుండటం ఎంతో సంతోషంగా ఉందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.