యూనివర్సల్ సబ్జెక్ట్‌‌‌‌తో ఎమ్‌‌‌‌ ఫర్ ఎమ్

యూనివర్సల్ సబ్జెక్ట్‌‌‌‌తో ఎమ్‌‌‌‌ ఫర్ ఎమ్

నిర్మాత మోహన్ వడ్లపడ్ల దర్శకుడిగా రూపొందించిన  చిత్రం ‘ఎమ్ ఫర్ ఎమ్’ (మోటివ్ ఫర్ మర్డర్).  ఒడిశా సూపర్ స్టార్ సంబీట్ ఆచార్య, అమెరికన్ హీరోయిన్ జో శర్మ జంటగా రూపొందిన ఈ మూవీని  పాన్ ఇండియా వైడ్‌‌‌‌గా మే 8న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌‌‌‌లో ప్రీ  రిలీజ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్‌‌‌‌ ఆదిత్య, సీనియర్ డైరెక్టర్ వి. సముద్ర అతిథులుగా హాజరై మూవీ టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.

దర్శక-నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ ‘ఇదొక  యూనివర్సల్ సబ్జెక్ట్,  క్లైమాక్స్  ఆశ్చర్యానికి గురిచేస్తుంది.  ఈ సినిమా ద్వారా ఒక కొత్త సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతున్నాం. ఇందులో  సీరియల్ కిల్లర్ ఎవరో చెప్పిన వారికి లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ ప్రకటిస్తున్నాం’ అని అన్నారు.  హీరోయిన్ జో శర్మ  మాట్లాడుతూ  ‘అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డా.  ఇప్పటికే ఈ చిత్రానికి 25 దేశాల్లో 50కి పైగా అంతర్జాతీయ అవార్డులు రావడం ఆనందంగా ఉంది’ అని చెప్పింది. టీమ్ అంతా పాల్గొన్నారు.