
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న మా భూమి రథయాత్రను రెండు వారాల పాటు (మంగళవారం నుంచి వచ్చే నెల వరకు) వాయిదా వేస్తున్నట్లు డీఎస్పీ ప్రెసిడెంట్ విశారదన్ మహారాజ్ వెల్లడించారు. ఎండల తీవ్రత వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం తెలిపారు. సామాజిక న్యాయ సాధనకు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు , రాజ్యాధికార చైతన్యం కోసం లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 5న అదిలాబాద్ జిల్లా నుంచి యాత్ర స్టార్ట్ అవుతుందని వెల్లడించారు.