mAadhaar vs కొత్త e-Aadhaar యాప్: అసలు తేడాలు ఇవే..!

mAadhaar vs కొత్త e-Aadhaar యాప్: అసలు తేడాలు ఇవే..!

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) ఫోన్ల కోసం కొత్తగా e-Aadhaar యాప్‌ని విడుదల చేసింది. ఇది పాత mAadhaar యాప్ కంటే కొత్త ఫీచర్స్ తో వచ్చింది. ప్రజలు ప్రభుత్వ పనులు, ఈజీగా వెరిఫికేషన్, పేపర్ లెస్  (Paperless) చేసేందుకు  ప్రభుత్వం ఈ కొత్త యాప్‌ను తయారు చేసింది. అయితే, ఈ రెండు యాప్‌ల మధ్య తేడా ఏంటి అనే దానిపై ప్రజల్లో కొంత గందరగోళం ఉంది. ఈ కొత్త e-Aadhaar యాప్‌కు, పాత mAadhaar యాప్‌కు మధ్య ఉన్న తేడాలు ఏంటంటే... –

UIDAI ఏం చెబుతోంది:  UIDAI  'X'  అకౌంట్ ద్వారా ఈ కొత్త యాప్ స్మార్ట్, సెక్యూర్ అండ్ పేపర్‌లెస్ అని తెలిపింది. ఈ కొత్త యాప్ పాత mAadhaar యాప్‌ను  భర్తీ చేయదు. కానీ ఈ రెండూ వేర్వేరు అవసరాల కోసం తయారు చేసిన ప్రత్యేక యాప్స్ లాగానే ఉంటాయి. mAadhaar యాప్ మొబైల్ ను దృష్టిలో ఉంచుకుని తయారు చేయగా, కొత్త e-Aadhaar యాప్ డిజిటల్ గుర్తింపును మరింత విస్తృతంగా, సురక్షితంగా ఉపయోగించడానికి ప్రత్యేకంగా తీసుకొచ్చారు.

1. పాత mAadhaar యాప్ : UIDAI మొదటగా విడుదల చేసిన యాప్ ఇదే. ఇది చాలా రకాల ఆధార్ సేవలను అందిస్తుంది. మీరు మీ ఆధార్ కార్డుకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఆధార్ PDF డౌన్‌లోడ్  చేసుకోవచ్చు, వర్చువల్ ID   క్రియేట్  చేసుకోవచ్చు. ఇంకా మీ కార్డును లాక్ లేదా అన్‌లాక్ చేయవచ్చు. అవసరమైతే మీ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.

2. కొత్త e-Aadhaar యాప్: ఈ కొత్త యాప్ భద్రతను పెంచడానికి, కుటుంబ సభ్యులను సులభంగా అనుసంధానం చేయడానికి రూపొందించింది. ఇందులో ఉన్న కొత్త ఫీచర్లు ఏంటంటే  ఒకే మొబైల్ నంబర్‌ రిజిస్ట్రేషన్ కోసం వాడుతున్నట్లయితే, ఒకే యాప్‌లో ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్ ప్రొఫైల్స్‌ను లింక్ చేయవచ్చు. ఇందులో ఫేస్ అతేంటికేషన్ ఫీచర్ (Face Authentication) ఉంది.  ఈ యాప్ తో QR కోడ్ ద్వారా మీ డిజిటల్ IDని షేర్ చేయవచ్చు. దీనివల్ల వెరిఫికేషన్  కోసం పేపర్ అవసరం లేకుండా త్వరగా పనులు  చేసుకోవచ్చు.