‘మాటే మంత్రము’ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌

‘మాటే మంత్రము’ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌

ఇంతకుముందు అప్పుడప్పుడు ఓ సినిమా చేసేది మేఘా ఆకాష్. కానీ ఇప్పుడు స్పీడు పెంచింది. వరుస సినిమాలతో పలకరిస్తోంది. నిన్న తన పుట్టినరోజు కావడంతో తన సినిమాల టీమ్స్ అన్నీ మేఘకి స్పెషల్ విషెస్‌‌‌‌‌‌‌‌ చెప్పాయి. ‘మాటే మంత్రము’ టీమ్ అయితే ఆమె ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హాకీ స్టిక్ పట్టుకుని కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌‌‌‌‌గా స్మోక్ చేస్తోంది మేఘ. తన పాత్ర కాస్త రెబల్‌‌‌‌‌‌‌‌గా ఉండబోతోందని ఈ లుక్ ద్వారా కన్‌‌‌‌‌‌‌‌ఫర్మ్ అయ్యింది. గోవా బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో జరిగే రొమాంటిక్ స్టోరీ ఇది.

రాహుల్ విజయ్‌‌‌‌‌‌‌‌ మేల్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నాడు. ఆల్రెడీ టాకీ పార్ట్ పూర్తయింది. రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. బద్ది అభిమన్యు డైరెక్ట్ చేస్తున్నాడు. మేఘ తల్లి బిందు సమర్పణలో సుశాంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, అభిషేక్ నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, అర్జున్ కళ్యాణ్, వైవా హర్ష తదితరులు నటిస్తున్నారు.  ఎప్పుడూ కూల్‌‌‌‌‌‌‌‌గా, క్యూట్‌‌‌‌‌‌‌‌గా కనిపించే మేఘ.. ఈ మోడర్న్‌‌‌‌‌‌‌‌ అమ్మాయి పాత్రలో ఎలా ఉంటుందో చూడాలి మరి.