
పద్మారావునగర్, వెలుగు : తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా డాక్టర్ మంచాల వరలక్ష్మి మరోసారి నియమితులయ్యారు. శుక్రవారం ఆమె సికింద్రాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత అంకిత భావంతో పని చేస్తానన్నారు. రెండు దశాబ్దాలుగా సంస్థలో నిబద్ధతతో పని చేస్తున్నానని పేర్కొన్నారు. భవిష్యత్ లో ప్రజల సమస్యల పరిష్కారానికి సమష్టిగా ముందుకు సాగుతానని ఆమె స్పష్టం చేశారు.