'మాచర్ల నియోజకవర్గం'లో షూటింగ్ పూర్తి..

'మాచర్ల నియోజకవర్గం'లో షూటింగ్ పూర్తి..

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంలో నటిస్తున్నాడు. ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందున్న ఈ మూవీ చివరి పాట మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. మిగిలిన పాటను త్వరలో చిత్రీకరించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం ప్రకటించింది. ఈ మూవీ నుండి తాజా ఒ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇందులో నితిన్, కృతి శెట్టి డాన్స్ మూడ్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ రీరికార్డింగ్ వర్క్ పూర్తైందని మేకర్స్ వెల్లడించారు. 

ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌ తో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతం అందించగా... ప్రసాద్ మూరెళ్ల కెమెరా, మామిడాల తిరుపతి డైలాగ్స్ అందిస్తున్నారు. ఆదిత్య మూవీస్, ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో సంయుక్తంగా శ్రేష్ట్ మూవీస్‌ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.