
శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు మాదాపూర్ డివిజన్ BRS అధ్యక్షులు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్ అరెస్ట్ అయ్యారు. మాదాపూర్ లోని 1000 గజాల స్థలాన్ని ఆక్రమించి తనను బెదిరిస్తున్నాడని ల్యాండ్ ఓనర్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ల్యాండ్ కావాలంటే 5 కోట్లు ఇవ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరించారని ఫిర్యాదులో తెలిపారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్ యాదవ్ ని అరెస్ట్ చేశారు.
ALSO READ :- సీఎం రేవంత్ కు తెలంగాణ సోయి లేదు: కేటీఆర్
శ్రీనివాస్ యాదవ్ శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కి ప్రధాన అనుచరుడు. శ్రీనివాస్ యాదవ్ మాదాపూర్ BRS పార్టీకి డివిజన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ పై గతంలోనూ ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. గతంలో BRS పార్టీ అధికారంలో ఉండటంతో శ్రీనివాస్ యాదవ్ పై ఎటువంటి కేసులు నమోదు కాలేదు.