సీఎం రేవంత్ కు తెలంగాణ సోయి లేదు: కేటీఆర్

సీఎం రేవంత్ కు తెలంగాణ సోయి లేదు: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.  రేవంత్ కు తెలంగాణ ఆత్మ లేదని.. తెలంగాణపై గౌరవం  అంతకన్నా లేదన్నారు.  అందుకే తెలంగాణ ఆత్మగౌరవంపై మోడీ సాక్షిగా రేవంత్ దాడి చేశారని విమర్శించారు. అసలు తెలంగాణ సోయి లేనోడు.. సీఎం కావడం మన ఖర్మ అంటూ ధ్వజమెత్తారు.  తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యమన్నారు కేటీఆర్. 

ALSO READ :- మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇలా తెలపండి...

 గోల్ మాల్ గుజరాత్ మోడల్ కు  బంగారు తెలంగాణ మోడల్ తో  పోలికెక్కడిదని కేటీఆర్ ప్రశ్నించారు. ఘనమైన గంగా జెమునా తెహజీబ్ మోడల్  కన్నా .. మతం పేరిట చిచ్చు పెట్టే గోద్రా అల్లర్ల మోడల్  నచ్చిందా..? అని రేవంత్ ను  ప్రశ్నించారు. నిన్నటి దాకా గుజరాత్ మోడల్ పై  నిప్పులు  చెరిగి.. ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే  గొప్పలా ?  ఇదేం నీతి ఇదేం రీతి అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్..