మాదాపూర్ ఐటీ కారిడార్లో కూల్చివేతలు.. ఫుట్ పాత్లపై ఫుడ్ కోర్టుల తొలగింపు

మాదాపూర్ ఐటీ కారిడార్లో కూల్చివేతలు.. ఫుట్ పాత్లపై ఫుడ్ కోర్టుల తొలగింపు

మాదాపూర్, వెలుగు: ఐటీ కారిడార్లో ఫుట్​పాత్​లను ఆక్రమించి నిర్మించిన ఫుడ్ స్టాళ్లను మాదాపూర్ పోలీసులు, టీజీఐఐసీ అధికారులు కలిసి కూల్చివేశారు. మాదాపూర్ నుంచి మైండ్ స్పేస్ వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫుట్ పాత్లను ఆక్రమించి భారీగా ఫుడ్ కోర్టులు, దుకాణాలు వెలిశాయి.

వీటితో నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్, టీజీఐఐసీ అధికారులతో కలిసి ఆదివారం ఉదయం నుంచి జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.