
త్వరలో కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడి చేస్తే వందల కోట్లు బయట పడతాయన్నారు కాంగ్రెస్ నేత మధుయాష్కి. కేసీఆర్ కుటుంబం దోచుకొని, దాచుకున్న దాంట్లో మోదీకి కప్పం కట్టారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ అవినీతిలో బీజేపీకి భాగముందన్నారు మధుయాష్కి.
సమస్క - సారక్క పర్యటనకు వెళ్లిన కవిత.. కాంగ్రెస్ ఎమ్మెల్యే లకు డబ్బులను ఎరగా చూపిందన్నారు మధుయాష్కి. పలువురు ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపిందని చెప్పారు. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన సీఎంపై కేటీఆర్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు అధికారం కోసం గుంట నక్కల్లా ఎదురు చూస్తున్నారని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ ను వీడేందకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు.. కానీ తామే ఎవర్నీ పార్టీలోకి తీసుకోవడం లేదన్నారు మధుయాష్కి. బీఆర్ఎస్ మా ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదన్నారు.