
- ఇంకా తాను సీఎం కొడుకు అనుకుంటుండు: మధుయాష్కీ
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గర్వం తలకెక్కి మాట్లాడుతున్నారని, ఆయన ఇంకా సీఎం కొడుకే అను కుంటున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన పలు వురు మైనార్టీ నాయకులు బీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం పార్టీలను వీడి శనివారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మాట్లాడుతు న్న తీరును అందరూ ఖండించా లన్నారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్ పాలనకు ప్రజలు ఆకర్షితులవుతు న్నారని ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోంద ని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కొత్త, పాత నాయకులంతా లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సీటు గెలుచుకోవాలన్నారు.