జూబ్లీహిల్స్, వెలుగు: ఓ బాలికను గర్భవతిని యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. వివరాల్లోకెలితే.. కూకట్‌పల్లికి చెందిన ఓ బాలిక ప్రైవేట్ స్కూల్లో చదువుతోంది. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అమ్మమ్మ దగ్గర ఉంటోంది. ఆమెకు రెండేళ్ల క్రితం ఇన్‌స్టాలో మహేశ్‌బాబు అనే వ్యక్తి పరిచయమయ్యారు.
ప్రేమ పేరుతో బాలికకు దగ్గరైన మహేశ్‌బాబు శారీరకంగా వాడుకున్నాడు. 40 రోజుల క్రితం ఆమెను ఎవరికీ చెప్పకుండా గుంటూరుకు తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లాక బాలికకు గర్భం కావడంతో అది పోయేందుకు గోలీలు ఇచ్చాడు. గోలీలు తీసుకున్న బాలికకు తీవ్ర రక్తస్రావం కాగా అనారోగ్యం బారిన పడింది.
దీంతో భయపడిన మహేశ్‌బాబు ఈ నెల 8న యూసఫ్ గూడలోని బంధువుల ఇంట్లో బాలికను వదిలి వెళ్లాడు. ఆమె 13న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో మధురానగర్ పోలీసులు మహేశ్‌బాబుతో పాటు అతడికి సహకరించిన లక్ష్మి, శ్రీకాంత్ పై జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి, కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
