ఈశ్వర్ సాయి–మాధురి రాథోడ్ వివాదంలో బిగ్ ట్విస్ట్ .. శరణ్యపై వేములవాడలో కేసు!

ఈశ్వర్ సాయి–మాధురి రాథోడ్ వివాదంలో బిగ్ ట్విస్ట్ .. శరణ్యపై వేములవాడలో కేసు!

ఫోక్ డ్యాన్సర్స్ ఈశ్వర్ సాయి - మాధురి రాథోడ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే  సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కు చేరడంతో మరింత హాట్‌టాపిక్‌గా మారింది. తనపై అకారణంగా దాడి చేయడమే కాకుండా..  వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆరోపిస్తోంది మాధురి. అంతేకాదు వేములవాడ టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు కూడా చేసింది..

ఈ నెల 19న వేములవాడలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను అసభ్యకర పదజాలంతో దూషించి, చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అంతేకాదు, ఘటనను వీడియోగా చిత్రీకరించడంతో పాటు తన ఐఫోన్‌ను తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని ఫిర్యాదులో తెలిపారు.

ఇక్కడితో ఆగకుండా.. వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు తన వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసేలా కథనాలు ప్రసారం చేశాయని మాధురి ఆరోపించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలపై, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఇదిలా ఉంటే, ఇటీవల వేములవాడలోని ఓ లాడ్జిలో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ లను  శరణ్య పట్టుబడ్డారని వీడియోలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాము రాజీకి వచ్చామని, ఇకపై ఆ వీడియోలను షేర్ చేయవద్దని శరణ్య కోరినట్లు వార్తలు వచ్చాయి.

ALSO READ : టాలీవుడ్‌లో ఆసక్తి రేపుతున్న ‘ముగ్గురు కోతులు’.. 

ఇప్పుడు అదే వ్యవహారంపై మాధురి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. మాధురి ఫిర్యాదు మేరకు శరణ్యతో పాటు సంబంధిత మీడియా సంస్థలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. దీంతో ఈ వివాదం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది.