మధుసూదన్‌‌‌‌‌‌‌‌కు హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ టైటిల్స్‌‌‌‌‌‌‌‌

మధుసూదన్‌‌‌‌‌‌‌‌కు హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ టైటిల్స్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌: ఐటీఎఫ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో మధుసూదన్‌‌‌‌‌‌‌‌ లింగ హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ టైటిల్స్‌‌‌‌‌‌‌‌ సాధించాడు. 50+ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో మధుసూదన్‌‌‌‌‌‌‌‌ 6–0, 6–1తో సంజయ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌పై నెగ్గి చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. 50+ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో విభాగంలో నర్సింహారెడ్డి–మధుసూదన్‌‌‌‌‌‌‌‌ 6–3, 6–4తో మురళీ కృష్ణంరాజు–సుబ్రహ్మణ్య రాజులపై గెలిచారు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆరంభం నుంచే అద్భుతంగా ఆడిన ఈ జోడీ కీలక టైమ్‌‌‌‌‌‌‌‌లో పాయింట్లు సాధించారు. దాంతో ప్రత్యర్థులకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో మధుసూదన్‌‌‌‌‌‌‌‌–శశికళ పెన్మెత్స ద్వయం 6–3, 6–4తో నితేశ్‌‌‌‌‌‌‌‌ రుంగ్తా–శ్రీజ్ఞాన్‌‌‌‌‌‌‌‌ మోటెపై గెలిచారు. ఈ వరల్డ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో దేశం నలుమూలల నుంచి సుమారు 150 మంది సీనియర్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు పాల్గొన్నారు.