కుక్కలను పెంచుకుంటే ట్యాక్స్

కుక్కలను పెంచుకుంటే ట్యాక్స్
  • మధ్యప్రదేశ్​లో ఓ మున్సిపాలిటీ నిర్ణయం

భోపాల్: ఇంటి పన్ను, నల్లా పన్ను తెలుసు.. కొత్తగా గిదేం పన్ను అనుకుంటున్నరా? మధ్యప్రదేశ్ లోని సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా కుక్కలను పెంచుకుంటే ట్యాక్స్ వేయనుంది. ఇందుకోసం మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇక చట్టం తెచ్చుడే మిగిలి ఉంది. సిటీలో పరిశుభ్రత, సిటిజనుల భద్రత, ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ వృందావన్ అహిర్వార్ చెప్పారు.

‘‘వీధి కుక్కల బెడద పెరిగింది. పెంపుడు కుక్కలు పబ్లిక్ ప్లేసుల్లో తిరగడంతో ఆ ప్రాంతాలు డర్టీగా మారుతున్నాయి. అందుకే కుక్కల రిజిస్ట్రేషన్, వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయాలని నిర్ణయించాం. దీంతో పాటు పెట్ డాగ్ ఓనర్లకు ట్యాక్స్ విధించేందుకు చట్టం తెస్తున్నాం. ఏప్రిల్ నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తుంది” అని మున్సిపల్ కమిషనర్ శుక్లా తెలిపారు.