కేసీఆర్‌‌ను మళ్లీ ఎలుకను చేయాలె

కేసీఆర్‌‌ను మళ్లీ ఎలుకను చేయాలె

కేసీఆర్ అరాచక, అవినీతి పాలనను అంతం చేసే వరకూ బీజేపీ కార్యకర్తలు కొట్లాడుతారని చెప్పారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. తమ పార్టీ కార్యకర్తలపై లాఠీలు ఝలిపిస్తే.. చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేసీఆర్ తినడానికి బీజేపీ ఏం బిర్యానీ కాదని, కడుపు చించుకుని బయటపడే పోరాటయోధులమని చెప్పారు. కేసీఆర్ సర్కారును కూల్చేవరకూ విశ్రమించబోమన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్వాగత సభ సందర్భంగా నాంపల్లిలోని కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా కేసీఆర్ వినూ.. ఒక కథ చెబుతా అంటూ ఓ సాధువు, ఎలుక కథను చెప్పాకొచ్చారాయన. 

‘‘అడవిలో ఒక సాధువు ఉండేవాడు... తపస్సు చేసేవాడు.. ప్రపంచంతో సంబంధంలేదు. భజనలు చేయడం ప్రసన్నంగా ఉండేవారు.. అక్కడ అనేక జంతువులుండేవి.. ఒక ఎలుక కూడా ఉండేది. ఈ సాధవు ఆ ఎలుకకు మేత వేసేవాడు.. సాధువు వేసే ధాన్యం తిని ఆయన చుట్టే ఆ ఎలుక తిరిగేది. ఆ ఎలుకపై సాధువుకు ప్రేమ కలిగింది. ఆ ఎలుకపై పిల్లి దాడికి వచ్చింది. సాధువు ఆ పిల్లిని తరిమేశాడు. సాధువు మనసులో ఒకటి అనిపించింది. ఇవాళ నేను ఉన్నా కాబట్టి పిల్లి నుంచి ఎలుకను కాపాడాను. రేపు నేను లేకపోతే... పిల్లి ఎలుకును తినేస్తుంది ఏం చేయాలి..? ఆ సాధువు తపస్వి... కమండలంలోని నీళ్లు తీసి ఎలుకపై చల్లి పిల్లిని చేశాడు. ఆ పిల్లిపై కుక్క దాడి చేసింది. పిల్లిపై కమండంలోని నీళ్లు చల్లి కుక్కను చేశాడు. పిల్లి కుక్కగా మారిపోయింది. అలాగే చేస్తూ చేస్తూ... ఎలుకను పులిని చేశాడు. పులి ఎవరికీ భయపడదు. కానీ పులి మనుసులో అనిపించింది నేను ఒరిజినల్‌గా ఎలుకను అని.. అది కేవలం సాధువుకు మాత్రమే తెలుసు. ఈ సాధువు జీవించి ఉన్నంతవరకు ఆ రహస్యం కూడా జీవించి ఉంటుంది. ఆయనను చంపేస్తే... శాశ్వతంగా పులిగా ఉండిపోవచ్చు అనుకుంది. సాధువు సర్వాంతర్యామి.. పులి తననే తినేసేందుకు వస్తుందని తెలుసుకున్నాడు. అందుకే ఆ పులిపై కమండలంలోని నీళ్లు చల్లి మళ్లీ ఎలుకను చేసేశాడు.పులి ఎలుకగా మారిపోయింది.  తెలంగాణ సోదరి-సోదరమణులారా.. కేసీఆర్ మళ్లీ ఎలుకగా మార్చాలి.  ఇందుకోసం పోరాటాలు కొనసాగాలి” అని శివరాజ్‌ సింగ్ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తల కోసం..

కీచక రాఘవ ఎక్కడ?

నీట్ పీజీ విద్యార్ధులకు సుప్రీంలో ఊరట