నీట్ పీజీ విద్యార్ధులకు సుప్రీంలో ఊరట

నీట్ పీజీ విద్యార్ధులకు సుప్రీంలో ఊరట

నీట్ పీజీ అడ్మిషన్ల విషయంలో డాక్టర్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2021–22 సంవత్సరానికి గాను నీట్ పీజీ అడ్మిషన్లకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది మెడికల్ ఎంట్రెన్స్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పీజీ పరీక్షలో ఓబీసీ వర్గాలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా బలహీన వర్గాలు) కేటగిరీకి 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ రిజర్వేషన్‎ను కోర్టు సమర్థించింది. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు రూ. 8 లక్షల వార్షిక ఆదాయ నిబంధనకు ఓకే చెప్పింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌పై పూర్తి విచారణ వచ్చే మార్చిలో జరుగునుంది. అప్పటివరకు ఈడబ్ల్యూఎస్ కోటాల చెల్లుబాటును కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ విషయంపై సుప్రీంకోర్టులో రెండు రోజులుగా కీలక విచారణ జరిగింది. ఈ రిజర్వేషన్ కేసును జస్టిస్ చంద్రచూడ్ , జస్టిస్ బొప్పన్న ధర్మాసనం విచారించింది.

For More News..

వరంగల్ నిట్ లో కరోనా కేసులు

సీఎం వరి వేయొద్దంటే.. ఎమ్మెల్యే నాటేసిండు..

లక్ష దాటిన కరోనా కేసులు