
యాసంగిలో రైతులు వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్ చెప్పగా.. ఎమ్మెల్యే ఏమో నాటు వేసి రైతు బంధు సంబురాలు చేసిండు. యాసంగిలో రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలు పండించాలని సీఎం సూచించినది తెలిసిందే. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి మాత్రం వరి నాటు వేసి ఆశ్చర్యపరిచారు. బుధవారం పరిగి మండలం గోవిందాపూర్ శివారులోని ఆర్ఎంపీ గఫార్ పొలంలో ఎమ్మెల్యే వరి నాటు వేసి, రైతుబంధుపై కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ‘రైతుబంధు కేసీఆర్’ఆకారంలో నాటు వేసి, సంబరాలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు మున్సిపల్ చైర్మన్, టీఆర్ఎస్ ముఖ్య నేతలు, రైతు వేదిక అధ్యక్షుడు, సర్పంచులు, కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించడం గమనార్హం. - వెలుగు, పరిగి