ఇక్కడ వర్షాలు..అక్కడ ఎండలు

ఇక్కడ వర్షాలు..అక్కడ ఎండలు

మధ్యభారతంలో ఎండలు మండిపోతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీలకు పైగా పెరిగాయి. మధ్యప్రదేశ్ లో అత్యధికంగా టెంపరేచర్లు 47 డిగ్రీలకు చేరాయి. రాజస్థాన్, చత్తీస్ ఘడ్ లోనూ టెంపరేచర్లు భారీగా పెరిగాయి. రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. యూపీ, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది IMD. రెండుమూడు రోజుల తర్వాతే రుతుపవనాల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు అధికారులు.

రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవానాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. నగరంలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరో రెండు రోజులు వేడి గాలులు వీస్తాయని తెలిపారు వెదర్ డైరెక్టర్ నాగరత్న.