స్వీట్లు అడిగితే.. ఫేక్ ఆర్డర్లతో నరకం చూపించారు

స్వీట్లు అడిగితే.. ఫేక్ ఆర్డర్లతో నరకం చూపించారు
  • సోషల్ మీడియాలో మధురై ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఊహించని షాక్
  • రూ. 1.69 లక్షల టీవీ నుంచి జేసీబీ వరకు సీవోడీ ఆర్డర్ పెట్టిన ఆకతాయిలు
  • "నా వద్ద డబ్బు లేదు.. ఆర్డర్లు ఆపండి" అంటూ మరో  వీడియో చేసిన బాధితుడు

చెన్నై: సోషల్ మీడియాలో ఓ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఊహించని షాక్ తగిలింది. దీపావళి సందర్భంగా ఫాలోవర్లు తనకు స్వీట్లు పంపాలని ఫోన్ నంబర్, ఇంటి అడ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కాస్తా ఆకతాయిలకు అవకాశంగా మారింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్ పేరుతో ఏకంగా లక్షల రూపాయల విలువైన ఖరీదైన ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలను క్యాష్-ఆన్-డెలివరీ (సీవోడీ) విధానంలో బుక్ చేసి వికృత చేష్టలకు పాల్పడ్డారు. వందల సంఖ్యలో డెలివరీ బాయ్స్ ఇంటి ముందు క్యూ కట్టడంతో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్ ఏకంగా ఊరి వదిలి వెళ్లిపోయాడు. 

వివరాల్లోకి వెళితే..తమిళనాడులోని మధురైకి చెందిన వీరమణి సోషల్ మీడియా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్. తన ఫాలోవర్లతో దీపావళి పండుగ ఆనందాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. పండుగ సందర్భంగా తనకు ఎవరైనా స్వీట్లు పంపవచ్చని ఫాలోవర్లకు ఓ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశాడు. అందులో ఫోన్ నంబర్, అడ్రెస్ కూడా పెట్టాడు. వీడియోను చూసినా కొందరు ఆకతాయిలు వీరమణి పేరుతో భారీ ఎత్తున ఫేక్ ఆర్డర్లు చేయడం ప్రారంభించారు. వీడియో చేసిన అరగంటలోనే ఏకంగా 15కి పైగా డెలివరీలు ఇంటికి చేరుకున్నాయి.

అన్నీ లక్షల విలువైన వస్తువులే..

వీరమణి ఇంటికి డెలివరీ బాయ్స్ తీసుకొచ్చిన వాటిలో టెలివిజన్లు, ఫ్రిజ్జులు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు ఉన్నాయి. ఒక టీవీ ధర ఏకంగా రూ. 1.69 లక్షలు ఉండటం గమనార్హం. వీటితో పాటు ఒక జేసీబీ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కవేటర్, కూడా అర్డర్ లిస్టులో ఉన్నాయి. అంతేకాకుండా.. స్విగ్గీ, జొమాటోల ద్వారా ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి ఆర్డర్లతో క్యూ కట్టారు. ఇది షాపింగ్ ఆర్డర్లతోనే ఆగిపోలేదు. కిడ్నీ కావాలని, కిడ్నీలు ఇస్తామనే తప్పుడు ప్రకటనలు సృష్టించి సంప్రదించాల్సిన నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వీరమణి ఫోన్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందులో చేర్చారు. ఇది నిజమేనని నమ్మి కిడ్నీ మార్పిడి అవసరం ఉన్నవారు, సహాయం చేయాలనుకునేవారు ఆ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరచూ ఫోన్లు చేయడం ప్రారంభించారు. 

ఆర్డర్లు ఆపాలని కోరుతూ మరో వీడియో

తన ఇంటికి డెలివరీ బాయ్స్ పెద్ద సంఖ్యలో వస్తుడంటంతో  ఆర్డర్లు ఆపాలని కోరుతూ వీరమణి మరో వీడియో చేశారు. డెలివరీ సిబ్బందిని అనవసరంగా ఇబ్బంది పెట్టవద్దని, తన వద్ద ఖరీదైన వస్తువులు కొనే ఆర్థిక స్థోమత లేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఫాలోవర్స్​ను వేడుకున్నారు. ఫేక్ ఆర్డర్లు పెట్టడం ఆపాలని విజ్ఞప్తి చేశాడు.