సిమ్లా, కాశ్మీర్ ను తలపిస్తున్న మధ్యప్రదేశ్

సిమ్లా, కాశ్మీర్ ను తలపిస్తున్న మధ్యప్రదేశ్

వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల అకాల వర్షాలు, వడగండ్ల వానలు కురుస్తున్నాయి. కొన్ని కొన్ని చోట్ల కంక రాళ్ల సైజులో వడగండ్ల వాన కురుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాసులు పోసినట్టు రాళ్ల వాన పడుతోంది. దీంతో కొన్ని చోట్ల రోడ్లు, పంట పొలాలన్నీ తెల్లని దుప్పటి కప్పినట్టు మంచు ప్రాంతాల్ని తలపిస్తున్నాయి. అలాంటి ఫొటోలే మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వైరల్ అవుతున్నాయి. 

మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగండ్ల వానలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం దాదాపు 30 నిమిషాల పాటు ఆగకుండా వడగండ్ల వాన కురిసింది. దీంతో పలు ప్రాంతాలన్నీ సిమ్లా, కాశ్మీర్ ని తలపిస్తున్నాయి. 

అయితే, ఈ వర్షాల వల్ల చేతికొచ్చిన పంటలన్నీ దెబ్బతిన్నాయి. రైతులకు నష్టాల్ని మిగిల్చాయి. రాబోయే కొద్ది రోజుల్లో కూడా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని, దేశ వ్యాప్తంగా రబీ సాగును వాయిదా వేసుకోవాలని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.