Norway Chess 2025: కార్ల్‌‌‌‌సన్‌‌‌‌దే నార్వే చెస్‌‌‌‌ టైటిల్

Norway Chess 2025:  కార్ల్‌‌‌‌సన్‌‌‌‌దే నార్వే చెస్‌‌‌‌ టైటిల్
  • ఆఖరి రౌండ్‌‌‌‌లో అర్జున్ చేతిలో ఓడినా టాప్ ప్లేస్‌‌‌‌
  • గుకేశ్‌‌‌‌, హంపికి మూడో స్థానం

స్టావాంగర్‌‌‌‌ (నార్వే): ఐదుసార్లు వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ మాగ్నస్‌‌‌‌ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌.. రికార్డు స్థాయిలో ఏడోసారి నార్వే చెస్‌‌‌‌ టైటిల్‌‌‌‌ను సొంతం చేసుకున్నాడు. టైటిల్‌‌‌‌పై ఆశలు రేపిన ప్రస్తుత వరల్డ్ చాంపియన్‌‌‌‌ డి. గుకేశ్‌‌‌‌ మూడో ప్లేస్‌‌‌‌తో సరిపెట్టాడు.  తెలుగమ్మాయి కోనేరు హంపి కూడా విమెన్స్ సెక్షన్‌‌‌‌లో మూడో స్థానం సాధించింది. శుక్రవారం రాత్రి జరిగిన ఆఖరిదైన పదో రౌండ్‌‌‌‌లో కార్ల్‌‌‌‌సన్‌‌‌‌ ఆర్మగెడాన్‌‌‌‌ టై బ్రేక్‌‌‌‌లో తెలంగాణ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ ఎరిగైసి అర్జున్‌‌‌‌ చేతిలో ఓడాడు. అయినా 16 పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచి టైటిల్‌‌‌‌ సొంతం చేసుకున్నాడు. మరో ఇండియా గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ డి. గుకేశ్‌‌‌‌.. ఫాబియానో కరువానాతో జరిగిన ఆఖరి రౌండ్‌‌‌‌లో ఘోర తప్పిదం చేసి ఓడాడు. ఫలితంగా 14.5 పాయింట్లతో మూడో ప్లేస్‌‌‌‌తో సరిపెట్టుకున్నాడు. కరువానా 15.5 పాయింట్లతో రెండో ప్లేస్‌‌‌‌ సాధించాడు. అర్జున్‌‌‌‌ (13) ఐదో స్థానంతో సంతృప్తి పడ్డాడు. విమెన్స్‌‌‌‌ సెక్షన్‌‌‌‌లో అనా ముజిచుక్‌‌‌‌ (ఉక్రెయిన్‌‌‌‌) 16.5 పాయింట్లతో టైటిల్‌‌‌‌ను సాధించింది. ఆర్‌‌‌‌. వైశాలితో జరిగిన చివరి రౌండ్‌‌‌‌లో ఆర్మగెడాన్‌‌‌‌ టైబ్రేక్‌‌‌‌లో ఓడినా పెద్దగా ప్రభావం చూపలేదు. లీ టింగ్జీ (16) రన్నరప్‌‌‌‌గా నిలవగా.. ఆఖరి రౌండ్‌‌‌‌ను డ్రా చేసుకున్న హంపి (15) మూడో ప్లేస్‌‌‌‌తో సరిపెట్టింది.