మహిళలపై నేరాలకు పాల్పడితే ఉరిశిక్షే

మహిళలపై నేరాలకు పాల్పడితే ఉరిశిక్షే

ముంబై: మహిళలు, పిల్లల పట్ల తీవ్ర నేరాలకు పాల్పడేవారికి తీవ్రతను బట్టి ఉరి శిక్ష లేదా కఠిన శిక్షలు వేసే బిల్లుకు మహారాష్ట్ర సర్కారు ఆమోదం తెలిపింది. శక్తి క్రిమినల్ లాస్‌‌‌‌‌‌‌‌ (మహారాష్ట్ర అమెండ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌) బిల్లు–2020ని ఆ రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం పాస్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఏపీలోని ‘దిశ చట్టం’ తరహాలో రూపొందించిన ఈ బిల్లును అసెంబ్లీ గురువారమే ఆమోదించింది. ఉభయ సభల ఆమోదం తర్వాత ఈ బిల్లును ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. మహిళలు, పిల్లలపై దాడి జరిగిన తేదీ నుంచి 30 రోజులలోపు విచారణను పూర్తి చేయాలని బిల్లులో పేర్కొంది. బిల్లును హోం మంత్రి దిలీప్ వాల్సే ప్రవేశపెట్టారు. ‘‘ఇది ఫూల్‌‌‌‌‌‌‌‌ ప్రూఫ్‌‌‌‌‌‌‌‌ చట్టం అని చెప్పను. ఈ చట్టంతో మహిళలకు రక్షణ పెరుగుతుంది. అంతేకాకుండా చట్టాన్ని దుర్వినియోగం చేసి ఒక వ్యక్తి ఇమేజ్‌‌‌‌‌‌‌‌ను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తే రూ.3 లక్షలు ఫైన్‌‌‌‌‌‌‌‌ వేసే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది’’ అని దిలీప్ చెప్పారు. ఈ చట్టం ప్రకారం అత్యాచారం చేసిన ప్రతి నిందితుడికీ మరణశిక్ష పడదని, నేరం తీవ్రతను బట్టి మాత్రమే నిర్ణయం ఉంటుందన్నారు.