
పాట్నా: బీహార్లో కొత్తగా ఏర్పాటై న మహాగట్బంధన్ సర్కార్ ఈ నెల 24న అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కో నుంది. జేడీయూ నేత, సీఎం నితీశ్ కుమార్ అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకునేందుకు ఫ్లోర్ టెస్ట్ ను ఎదుర్కోనున్నారు. ఎన్డీఏకు గుడ్ బై చెప్పి, ఆర్జేడీతో జట్టుకట్టి నితీశ్ బుధవారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, జేడీయూ, ఆర్జేడీకి కలిపి 124 (మ్యాజిక్ ఫిగర్ కంటే ఒకటి ఎక్కువ) సభ్యులు ఉన్నా రు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు తెలపడంతో నితీశ్ కుమార్ ఈజీగా గట్టెక్కనున్నారు.