
మహారాష్ట్రలోని నాసిక్- షిర్డీ హైవేపై పఠారే సమీపంలో సాయిబాబా భక్తులతో వెళ్తున్న బస్సు, ట్రక్కును ఢీకొనడంతో 10 మంది మరణించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్టు నాసిక్ పోలీసులు వెల్లడించారు. అయితే ఈ బస్సులో దాదాపు 50 మంది వరకు ఉన్నట్లు సమాచారం. కాగా ప్రమాదానికి ఖచ్చితమైన కారణం మాత్రం తెలియరాలేదు.
నాసిక్-షిర్డీ హైవేపై జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.