
ముంబై : మహారాష్ట్రలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గత 10 రోజుల్లో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 241శాతం పెరిగింది. జూన్ 3 నాటికి 5,127 కొత్త కేసులు నమోదుకాగా.. జూన్ 13 నాటికి ఆ సంఖ్య 17,480కి చేరింది. పది రోజుల వ్యవధిలోనే ఇంత భారీ స్థాయిలో కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది.
మహారాష్ట్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం మే నెలలో ఆ రాష్ట్రంలో మొత్తం 9,354 కొవిడ్ కేసులు వచ్చాయి. వాటిలో 5,980 మంది ముంబైకి చెందిన వారే కావడం విశ్షం. గత నెలలో మహమ్మారి బారిన పడి 127 మంది చనిపోయారు. మరోవైపు జూన్ 1 నుంచి 12 మధ్యకాలంలో మహారాష్ట్రలో 23,941 మంది కరోనా బారిన పడగా.. ఒక్క ముంబైలోనే 14,945మందికి వైరస్ సోకింది. ఈ 12 రోజుల్లో వైరస్ కారణంగా12 మంది మృ-త్యువాతపడ్డారు. లక్షణాల తీవ్రత తక్కువగానే ఉండటంతో పాటు కొత్త వేరియెంట్ కేసులేవీ నమోదుకావడం లేదని వైద్య నిపుణులు అంటున్నారు.