జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్స్‌ను రద్దుచేసిన మహారాష్ట్ర

జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్స్‌ను  రద్దుచేసిన మహారాష్ట్ర

జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవజాత శిశువుల చర్మంపై జాన్సన్ బేబీ పౌడర్ ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్ డీ ఏ) వెల్లడించింది. పుణె, నాసిక్ నగరాల నుంచి సేకరించిన పౌడర్ శాంపిళ్లను కోల్ కతాలోని సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీ లో పరీక్షించగా.. అవి ప్రామాణిక పీహెచ్ స్థాయులను కలిగి లేవని తేలిందని తెలిపింది. 

ఈనేపథ్యంలో డ్రగ్స్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940ని అనుసరించి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి షోకాజ్ నోటీసు జారీ చేశామని మహారాష్ట్ర ఎఫ్ డీఏ తెలిపింది. జాన్సన్ బేబీ పౌడర్ స్టాక్ ను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని కూడా నిర్దేశించినట్లు పేర్కొంది. అయితే మహారాష్ట్ర ఎఫ్ డీఏ  వాదనను జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఖండించింది. లైసెన్సు రద్దు చేయడాన్ని కోర్టులో సవాలు చేసింది. పౌడర్ శాంపిళ్లను సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీకి పంపాలని కోరింది.