సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రేకు ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రేకు ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో మహారాష్ట్ర సీఎం  ఏక్ నాథ్ షిండే కు భారీ ఊరట లభించింది.  కొత్త స్పీకర్ ఎన్నికను సవాలు చేస్తూ  శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఇవాళ ఈ కేసును విచారించిన సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం... అత్యవసర విచారణకు నిరాకరించింది. పిటిషన్లు అన్నింటినీ రాజ్యాంగ ధర్మాసనంకు బదిలీచేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

స్పీకర్ ఎన్నికతోపాటు, అవిశ్వాస పరీక్షలో పార్టీ జారీ చేసిన విప్‌లను ధిక్కరించి ఎమ్మెల్యేలు ఓటు వేశారు. షిండే వర్గం చీఫ్ విప్‌ను ఎన్నుకోవడంతోపాటు, విశ్వాస పరీక్ష, స్పీకర్ ఎన్నిక, 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై  సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.  ఈ కేసు విచారణను తిరస్కరించిన సుప్రీం కోర్టు... కేసును రాజ్యాంగ ధర్మాసనంకు బదిలీ చేసింది.