పాపం చిరుత..యాక్సిడెంట్ లో తొంటి విరిగింది..వీడియో వైరల్

పాపం చిరుత..యాక్సిడెంట్ లో తొంటి విరిగింది..వీడియో వైరల్

పాపం చిరుత..అనుకోని సంఘటన..వేగానికి మారుపేరైన చిరుత.. నడవలేని పరిస్థితి.. కాదు..లేవలేని పరిస్థితి..రోడ్డు పై దీనంగా దేకుతూ వెళ్తోంది.. రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని ఇలా అయ్యింది. దీనస్థితిలో రోడ్డు పై కదలలేని స్థితిలో  ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది.

మంగళవారం (నవంబర్​11) మహారాష్ట్రలోని పూణె సమీపంలోని అహల్య నగర్​  రోడ్డు దాటుతుండగా ఓ చిరుతను కారు ఢీకొట్టింది. దీంతో చిరుత వెనక భాగం విరిగింది. దీంతో నడలేని పరిస్థితి. బాధతో రోడ్డుపై పడిపోయింది చిరుత. కొంత సమయం  తర్వాత మెల్లగా పొదల్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. కానీ సాధ్యం కాలేదు.. ఇక రోడ్డు వెంట వెళ్తున్న ప్రజలు దాని దీన స్థితిని చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. అయితే ఈ ఘటన తర్వాత అహల్య నగర్​ ప్రాంతలో ఆందోళన వ్యక్తమవుతోంది. 

గాయపడిన చిరుతను చికిత్స కోసం తరలించారు అటవీశాఖ అధికారులు. ఇటీవలి కాలంలో పూణే జిల్లాలో చిరుతపులి దాడులు చాలా జరిగాయి. కొన్ని ప్రమాదాలు జరిగాయి. వాటిలో కొన్ని ప్రాణాలు కోల్పోయాయి. తరుచుగా చిరుతలు జనవాసాల్లోకి రావడం, దాడులు చేస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.