షిండే వర్గంలో 50 మంది ఎమ్మెల్యేలు!

షిండే వర్గంలో 50 మంది ఎమ్మెల్యేలు!

అసోం గౌహతిలో రాడిసన్ బ్లూ హోటల్లో ఏక్ నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేల క్యాంప్ కొనసాగుతోంది. షిండే వర్గంలో రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య 50 మందికి చేరినట్టు తెలుస్తోంది. రెబెల్స్ బలం పెరుగుతుండటంతో శివసేన చర్యలకు దిగింది. 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్ కు సిఫారసు చేసింది. రెబెల్స్ నాయకుడు ఏక్ నాథ్ షిండే సహా 11మందిపై వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్ ను కోరారు శివసేన ఎంపీ అర్వింద్ సావంత్. 
 

మొదట గుజరాత్ లోని హోటల్లో ఉన్న ఎమ్మెల్యేలు అక్కడి నుంచి గౌహతికి షిప్ట్ అయ్యారు.  ఈ ఫైవ్  స్టార్ హోటల్లో 7 రోజులకు... 70 రూమ్స్ బుక్  చేసినట్లు సమాచారం. ఇందుకోసం 56 లక్షలు చెల్లించనట్టు తెలుస్తోంది.  దీనికి అదనంగా ఫుడ్, ఇతర ఖర్చులు అదనం. ఒక్క రోజుకు రూ.8 లక్షల వరకు ఖర్చు చేస్తునట్టు తెలుస్తోంది. 

గౌహతి రాడిసన్  బ్లూ హోటల్లో మొత్తం 196 రూమ్స్ ఉన్నాయి. రెబల్  ఎమ్మెల్యేల కోసం బుక్  చేసిన 70 రూమ్స్ కాకుండా... అంతకు ముందే బుక్  అయిన రూమ్స్  మాత్రమే ఉన్నాయి. ఐతే, వీటిని మినహాయించి కొత్తగా రూమ్  బుకింగ్  ను మేనేజ్ మెంట్ ఆపేసింది. అలాగే బాంక్వెట్  కూడా మూసివేశారని... హోటల్లో ఉండే వారికి మినహా బయటి వారిని రెస్టారెంట్  లోకి  అనుమతించడం లేదని తెలుస్తోంది. హోటల్ ఖర్చులే కాకుండా ఎమ్మెల్యేలంతా ఛార్టెడ్  ప్లైట్ లో గుజరాత్ నుంచి గౌహతికి వచ్చారని సమాచారాం. ఈ ట్రాన్స్ ఫోర్ట్ కు ఎంత ఖర్చు అయ్యిందో బయటకు రావడం లేదు. ఈ ఖర్చంతా ఎవరు భరిస్తున్నారనే దానిపై క్లారిటీ రాలేదు.