మహారాష్ట్రలో భారీగా పెరుగుతున్న కేసులు

మహారాష్ట్రలో భారీగా పెరుగుతున్న కేసులు

కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కొత్తగా కొవిడ్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆ రాష్ట్రంలో గత 24 గంటల్లో 4255 మంది కొవిడ్ బారినపడ్డారు. ఒక్క ముంబయి నగరంలోనే 2,366 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,879 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 20,634 యాక్టివ్ కేసులుండగా.. ఒక్క ముంబైలోనే 13,005 క్రియాశీల కేసులున్నాయి.

గురువారం నాగ్పూర్లో రెండు బీఏ.5 ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ కేసులు గుర్తించినట్లు నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. వారిలో ఒక పేషెంట్ 29 ఏళ్ల యువకుడు కాగా.. మరొకరు 54 మహిళ ఉన్నారు. వారికి జూన్ 6, 9 తేదీల్లో కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది.