మహారాష్ట్రలో తాగునీటి కష్టాలు 

మహారాష్ట్రలో తాగునీటి కష్టాలు 

మహారాష్ట్రలో నీటి కష్టాలు మాములుగా లేవు. తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాసిక్ లోని గవాల్డి లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులు ..తర్వాత ఇటువైను కన్నేత్తి కూడా చూడటం లేదని చెబుతున్నారు. హామీలు ఇవ్వడమే కానీ..వాటిని అమలు చేయడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి సమస్య పరిష్కరించాలని నేతలు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. ఇక చేసేది ఏమీ లేక ఇంటికో రూ.50 వసూలు చేసి సర్పంచ్ కి అందజేస్తున్నామని..ఆయన వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని చెబుతున్నారు.