దర్శక దిగ్గజం రాజమౌళికి మహేశ్, ఎన్టీఆర్ బర్త్ డే విషెస్

దర్శక దిగ్గజం రాజమౌళికి మహేశ్, ఎన్టీఆర్ బర్త్ డే విషెస్

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శక ధీరుడు డైరెక్టర్  రాజమౌళికి ఇవాళ పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు విషెష్ చెబుతున్నారు. శాంతినివాసం అనే సీరియల్ తో ఎంట్రీ ఇచ్చి  బాహుబలి, RRR తో దేశం గర్వించదగ్గ డైరెక్టర్ గా ఎదిగిన రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, సాయిధరమ్ తేజ్, బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్ గణ్, దర్శకుడు బాబీ రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

జక్కన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఎల్లప్పుడూ ఆనందగా ఉండాలంటూ జూనియర్ ఎన్టీఆర్  బర్త్ డే విషెస్ చెప్పారు.

 

మీ సినిమాలతో తమకు స్ఫూర్తినివ్వాలంటూ రాజమౌళికి  మహేశ్ బాబు బర్త్ డ్ విషస్ చెప్పారు. ఎల్లప్పుడూ విజయాలతో ఆనందంగా ఉండాలని కోరారు. 


ఇండియన్ సినిమాకు టార్చ్ బేరర్ అంటూ రాజమౌళికి సాయిథరమ్ తేజ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాజమౌళి భారతీయ సినిమాకు గర్వకారణమంటూ ట్వీట్ చేశారు. భారత దేశం గర్వపడేలా చేస్తూ ఉండాలని రాజమౌళికి బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్ గణ్ ట్విట్టర్లో బర్త్ డే విషెస్ చెప్పారు.