V6 News

రియల్ ఎస్టేట్ దందాతోనే సర్కార్ నడుస్తోంది : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి

రియల్ ఎస్టేట్ దందాతోనే సర్కార్ నడుస్తోంది : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి
  • ఆస్తులు అమ్మి అప్పులు చేసి జల్సాలు చేస్తారా?: మహేశ్వర్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తోందని, భూదందాల మీదనే ఈ గవర్నమెంట్ నడుస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఆరోపించారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌తో కలిసి శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. సర్కారు ఆస్తులు అమ్ముకుంటూ, అప్పులు చేస్తూ ప్రభుత్వం జల్సాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘హిల్ట్ పాలసీ అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నారు. హౌస్ కమిటీ వేసి రివ్యూ చేసే కనీస జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. 

అప్పులు చేసి జల్సాలు చేసే ధోరణిలో కాంగ్రెస్ ఉంది’’ అని విమర్శించారు. ‘‘ఒక క్రీడాకారిణికి కోటి రూపాయలు, డీఎస్పీ ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం.. చనిపోయిన సామాన్యుడు శంకర్ గౌడ్ కుటుంబానికి కేవలం రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటుందా? సామాన్యుడి ప్రాణం అంటే ప్రభుత్వానికి లెక్కలేదా?’’ అని ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ.. ‘మర మనిషి అంటే రజనీకాంత్ రోబో లెక్కనా?’ అంటూ ఎద్దేవా చేశారు. కవిత, ఆమె తండ్రి కేసీఆర్ లాగా తాము లిక్కర్‌‌కు బానిసలం కాదని.. భారతమాతకు బానిసలమని స్పష్టం చేశారు.