పార్టీ మార్పుపై వారం రోజుల తర్వాత మాట్లాడుతా: మైనంపల్లి

పార్టీ మార్పుపై వారం రోజుల తర్వాత మాట్లాడుతా: మైనంపల్లి

మెదక్ జిల్లా  బీఆర్ఎస్ అభ్యర్థిగా తన కుమారుడు రోహిత్ రావు పేరును ప్రకటించకపోవడంపై పార్టీపై అసంతృప్తిగా ఉన్న మాల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీ మారుతారంటూ గతకొద్దిరోజులుగా  ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో పార్టీ మార్పుపై ఆయన క్లారిటీ ఇచ్చారు. 2023 ఆగస్టు 27 ఆదివారం నుంచి వారం రోజుల పాటు మాల్కాజిగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానన్నారు మైనంపల్లి.. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో ప్రజలు అడిగిన ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పతానన్నారు. 

పార్టీ మార్పు గురించి మాల్కాజిగిరి  ప్రజలు ఏది చెప్తే.. అది చేస్తానని స్పష్టం చేశారు.   తన కొడుకు రోహిత్ రావు నిత్యం ప్రజల్లో ఉంటూ.. తన కంటే ఎక్కువ పని చేస్తున్నాడని, కరోనా టైమ్ లో  మెదక్ నియోజకవర్గంలో అనేక కార్య్రక్రమాలను చేస్తూ  ప్రజలకు అందుబాటులో ఉన్నాడన్నారు.

 మల్కాజ్ గిరి తనకు, మెదక్ టికెట్ తన కొడుక్కి ఇవ్వాలంటూ ముందునుండి మైనంపల్లి డిమాండ్ చేస్తున్నారు. అయితే అధిష్టానం అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవందర్ రెడ్డికి తిరిగి టికెట్ కేటాయించింది. ఈ క్రమంలో మైనంపల్లి   మంత్రి హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ పై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఖండించారు. సీఎం కేసీఆర్ కూడా పార్టీ రూల్స్ బ్రేక్ చేస్తే ఎంత పెద్ద లీడరైన తీసి పక్కన పెడతామని హెచ్చరించారు. 

మైనంపల్లికి టికెట్ కేటాయించామని పోటీ చేయడం, చేయకపోవడం ఆయన ఇష్టమంటూ చెప్పారు. అయితే మైనంపల్లి మాత్రం తన కొడుకు విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహారిస్తున్నారు.  తన కొడుక్కి టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నారు. త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తునన్నారు. మరోవైపు మైనంపల్లిని పార్టీ నుంచి బహిష్కరించాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.