ఔటర్ పై ఘోరం : కారు గుద్దితే.. తల తెగి ఎగిరి పడింది

ఔటర్ పై ఘోరం : కారు గుద్దితే.. తల తెగి ఎగిరి పడింది

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై సోమవారం రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. కారు మితిమీరిన వేగంతో డీకొట్టడంతో వ్యక్తి కారు ముందుబాగంలోని అద్దంలో ఇరుక్కుపోయాడు.  అతని తల కారు వెనక సీటులో పడింది. దీంతో ఆ వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందాడు.  ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

విషయం తెలుసుకున్న  శంషాబాద్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి విచారణ చేపట్టారు. మృతుడు శంషాబాద్ తొండుపల్లి గ్రామానికి చెందినట్లుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు.  ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.