యాదాద్రి పవర్ ప్లాంట్‎లో భారీ అగ్ని ప్రమాదం

యాదాద్రి పవర్ ప్లాంట్‎లో భారీ అగ్ని ప్రమాదం

నల్లగొండ: యాదాద్రి పవర్ ప్లాంట్‎లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దామరచర్ల మండం వీర్లపాలెంలోని పవర్ ప్లాంటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యూనిట్-1 బాయిలర్‎లో ఆయిల్ లీకై మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేశారు. సకాలంలో మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. 

ఆదివారం (ఏప్రిల్ 28) రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అధికారులు, కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్లాంటులో అగ్ని ప్రమాద ప్రమాద ఘటనపై అధికారులు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. 

అధికార యంత్రాంగం ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తోంది. ప్రమాదం జరిగిన యూనిట్ 1 వచ్చే నెల ప్రారంభించేందుకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ట్రయల్ రన్ చేస్తోన్న క్రమంలోనే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో యూనిట్ 1 పనుల ప్రారంభం మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.