ప్లైవుడ్ గోదాంలో అగ్నిప్రమాదం

ప్లైవుడ్ గోదాంలో అగ్నిప్రమాదం

గండిపేట, వెలుగు: కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఓ ప్లైవుడ్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న సుమిత్ ఎంటర్​ప్రైజెస్​కు చెందిన ఈ గోదాంను హోలీ పండుగ సందర్భంగా రెండు రోజులుగా మూసివేశారు. గురువారం తెల్లవారుజామున ఆకస్మాత్తుగా మంటలు చెలరేగగా, లోపల నిల్వ ఉన్న ప్లైవుడ్ షీట్స్‌‌‌‌‌‌‌‌ దగ్ధమయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజిన్ల సహాయంతో దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో గోదాంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది