జూబ్లీహిల్స్: కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్‌‌‌‌లో భారీ మోసం

జూబ్లీహిల్స్: కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్‌‌‌‌లో భారీ మోసం
  •     రూ.32 లక్షలు సొంత ఖాతాలోకి మళ్లించుకున్న ఉద్యోగులు

జూబ్లీహిల్స్, వెలుగు: ప్రముఖ బీమా సంస్థ కోటక్​ లైఫ్​ ఇన్సూరెన్స్​లో భారీ ఆర్థిక మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. పాలసీదారులు చెల్లించిన ప్రీమియం మొత్తాలను కంపెనీ ఖాతాలకు బదులుగా వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు మళ్లించి దుర్వినియోగం చేసిన ఘటనపై బంజారాహిల్స్ పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ క్లస్టర్ హెడ్ కొత్తపల్లి సాయి శివ కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉద్యోగులు కోసూరి నవీన్ సాయి కుమార్, ములిగే లిబీనా, మరికొందరిపై కేసు నమోదు చేశారు. 

నిందితులు పాలసీదారులను మోసపూరితంగా ప్రేరేపించి, బీమా ప్రీమియం చెల్లింపులను కంపెనీ అధికారిక ఖాతాలకు కాకుండా వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతర్గత విచారణలో సుమారు రూ.32,17,781 మేర నిధులను అనధికారికంగా మళ్లించినట్లు సంస్థ యాజమాన్యం గుర్తించింది. సంబంధిత ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.