ఢిల్లీ అసెంబ్లీలో కారు కలకలం రేపింది. సెక్యూరిటీని దాటుకుని అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశించి హల్ చల్ చేసింది. మెయిన్ గేటును ఢీకొట్టి కారు దూసుకుపోవడం టెన్షన్ కు గురిచేసింది. 2026 ఏప్రిల్ 06న (సోమవారం) మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్ నెంబర్ ప్లేట్ ఉన్న కారు అతివేగంతో ఢిల్లీ అసెంబ్లీలోకి దూసుకెళ్లింది. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగకుండా వెళ్లిపోయింది. సెక్యూరిటీ బారికేడ్లను ఢీకొట్టి.. ఆవరణలోకి ప్రవేశించి దుండగులు హల్ చల్ చేశారు.
మధ్యహ్నం 2 గంటల సమయంలో 2వ గేటును ఢీకొట్టి అసెంబ్లీ ఆవరణలోకి కారు ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. స్పీకర్ కారుపై ఫ్లవర్ బొకే పెట్టి, ఇంకు చల్లి అక్కడి నుంచి ఉడాయించింది. కారును అడ్డుకునేందుకు సెక్యూరిటీ ప్రయత్నించినా.. అతి వేగంతో అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు దుండగులు.
Also Read : హైవే ఎక్కాలంటే కారు ఉంటే సరిపోదు
అసెంబ్లీలో కారు హల్ చల్ చేయడంతో సెక్యూరిటీతో పాటు నాయకులు భయాందోళనలకు గురయ్యారు. కారును ట్రేస్ అవుట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా కారును గుర్తించి డ్రైవర్ ను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. దుండగుడు ఏ ఉద్దేశంతో స్పీకర్ కారుపై బొకే పెట్టాడో దర్యాప్తు చేస్తామని తెలిపారు. అయితే అసెంబ్లీలోకి కారు ప్రవేశించడాన్ని సెక్యూరిటీ వైఫల్యంగా విపక్షాలు విమర్శిస్తున్నాయి.
