జ్యోతిష్యం ప్రకారం సంక్రాంతి పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. పురాణాల ప్రకారం సూర్య గమనం ఆధారంగా ఈ పండుగ జరుపుకుంటారు. సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమమవుతుంది. ఇలాంటి పవిత్రమైన రోజు ( 2026 జనవరి 15) కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే.. శుభ శక్తులను ఆహ్వానించినట్టేనని పండితులు చెబుతున్నారు. ఏ వస్తువులు తెచ్చుకుంటే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
హిందూ సంప్రదాయంలో మకర సంక్రాంతికి రోజున చేసే పనులు, ఇంట్లోకి తీసుకువచ్చే వస్తువులు మన జీవితంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం ... వాస్తు నిపుణులు చెబుతుంటారు. అందుకే సంక్రాంతిని కేవలం పండుగగా మాత్రమే కాకుండా శుభ శక్తులను ఆహ్వానించే సందర్భంగా కూడా చాలామంది చూస్తారు.
మకర సంక్రాంతి అనేది పంట పండిన ఆనందాన్ని పంచుకునే పండుగ మాత్రమే కాదు. ఇది జీవితంలో కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలను పెట్టుకునే సమయంగా కూడా భావిస్తారు. అందుకే ఈ రోజున ఇంటిని శుభ్రం చేయడం, పాత పనులను ముగించడం, సానుకూల ఆలోచనలతో ముందుకు సాగడం చాలా మంది చేస్తుంటారు. అందుకే సంక్రాంతి పండుగ రోజు కొన్ని శుభ వస్తువులను ఇంటికి తీసుకువచ్చి, వాటిని విశ్వాసంతో ఉంచడం వల్ల మనసులోనూ ధైర్యం పెరిగి.. అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు.
ప్రతికూల శక్తి తగ్గాలంటే: వాస్తు ప్రకారం ఇంట్లోని ప్రతికూల శక్తి తగ్గాలంటే శబ్దం, వెలుగు, లోహం, సహజ శక్తులకు సంబంధించిన వస్తువులు చాలా ఉపయోగపడతాయి. సంక్రాంతి రోజున చాలామంది ఇళ్లలో విండ్ చైమ్స్‌ను తీసుకువస్తారు. ఇవి గాలి వీచే చోట ఉంచినప్పుడు మధురమైన శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం ఇంట్లో నిలిచిపోయిన నెగటివ్ ఎనర్జీని తొలగించి ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుందని నమ్మకం. అందుకే తలుపు దగ్గర లేదా కిటికీ పక్కన వీటిని ఉంచుతారు.
ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి: లోహంతో తయారైన తాబేలు గురించి వాస్తు శాస్త్రంలో విస్తృతంగా ప్రస్తావన ఉంటుంది. తాబేలును విష్ణుమూర్తి అవతారానికి చిహ్నంగా భావిస్తారు. ఇత్తడి లేదా బంగారం రంగులో ఉండే తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల స్థిరత్వం పెరుగుతుందని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. ఈ తాబేలును ఉత్తర దిశలో ఉంచితే ఆర్థిక పరిస్థితి మెరుగవడం.. ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి కనిపించడంతో పాటు గతంలో నెలకొన్న అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు అంటున్నారు.
ఆర్థికసమస్యలకు పరిష్కారం: ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారు మూడు రాగి నాణేలను ఎరుపు రంగు దారంతో కట్టి ఇంటి ప్రధాన ద్వారం లోపలి వైపు ఉంచడం వల్ల ఆదాయ మార్గాలు మెరుగవుతాయని సంప్రదాయం చెబుతోంది. దీని డబ్బు సంబంధిత సమస్యలు తగ్గి, కొత్త అవకాశాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. సంక్రాంతి రోజున ఈ నాణేలను ఇంటికి తీసుకువచ్చి పూజామందిరంలో పెట్టి పూజ చేసి 11 రోజుల తరువాత శుభ ముహూర్తంలో ఎర్రటి క్లాత్‌లో ఇంటి గుమ్మానికి కట్టాలి.
కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిళ్లు తగ్గేందుకు ... కుటుంబంలో కలహాలు ఉన్నప్పుడు, పండుగల సమయంలో తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా సానుకూల మార్పుకు దారి తీస్తాయ పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మకర సంక్రాంతి రోజున ఇంటికి శుభ సూచకమైన వస్తువులను తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పురాణాల్లో ఉందని పండితులు అంటున్నారు. అయితే ఈ వస్తువులను ఎలా ఎంచుకోవాలి, ఎక్కడ ఉంచాలి అనే అంశాలపై పండితులను అడిగి తెలుసుకోవాలి.
కుటుంబసభ్యుల మధ్య అవగాహన కోసం: క్రిస్టల్‌తో తయారైన వస్తువులకు కూడా వాస్తులో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. క్రిస్టల్ బాల్స్ లేదా ఇతర క్రిస్టల్ అలంకరణలు సంపదను ఆకర్షించే శక్తి కలిగి ఉంటాయి. ఇవి ఇంట్లో ఉంచినప్పుడు కుటుంబ సభ్యుల మధ్య సమతుల్యత పెరుగుతుందని, పరస్పర అవగాహన మెరుగవుతుందని చెబుతారు. ఇంట్లోని వాతావరణం హాయిగా మారడంలో కూడా క్రిస్టల్ వస్తువులు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు
దంపతుల కలహాల పరిష్కారానికి : దాంపత్య జీవితంలో శాంతి కావాలనుకునే వారు లేదా కుటుంబ బంధాలు బలపడాలని ఆశించే వారు మాండరిన్ బాతుల జంటను ఇంట్లో ఉంచుతారు. ఈ బాతులు ప్రేమకు, అనురాగానికి ప్రతీకగా భావిస్తారు. పడకగదిలో నైరుతి దిశలో ఒక జత బాతులను ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందని, అపార్థాలు తగ్గుతాయని విశ్వాసం ఉంది. అందుకే సంక్రాంతి సమయంలో ఈ వస్తువును కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
