బైక్ ల చోరీ.. రీల్స్ చేసి ఇన్ స్టాలో పోస్ట్..

బైక్ ల చోరీ.. రీల్స్ చేసి ఇన్ స్టాలో పోస్ట్..

సికింద్రాబాద్​, వెలుగు: ఓ యువకుడు బైక్​లతో చోరీ చేసి వాటితో ఫీట్లు చేస్తూ రీల్స్​తీసి ఇన్​స్టాగ్రామ్​లో పోస్టు చేసి చివరకు పోలీసులకు చిక్కాడు. నిందితుడి వద్ద వివిధ కంపెనీలకు చెందిన 9 బైక్ లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపారు. నార్త్​జోన్​డీసీపీ రోహిణి ప్రియదర్శిని మంగళవారం మీడియాకు తెలిపారు. చాంద్రాయణగుట్టకు చెందిన షేక్​ ఇబ్రహీం(19) బైక్​లపై ఫీట్లు చేయడం సరదా. వివిధ రకాల బైక్​లపై ఫీట్లు చేయాలనుకుని, బాలుడితో కలిసి బైక్​ చోరీలు చేశారు. నంబర్ ప్లేట్లు మార్చి రోడ్లపై బైక్ లతో ఫీట్లు చేస్తూ రీల్స్​చేసి ఇన్​స్టాగ్రామ్​లో పోస్టు చేసేవాడు. అనంతరం ఆ బైక్​లను పార్టులుగా విడగొట్టి అమ్మేవాడు. 

వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేసేవాడు.  ఇలా ఇద్దరూ కలిసి ఎస్​ఆర్​నగర్​, హుమాయున్​నగర్​, ఫిల్మ్​నగర్​,రామ్​గోపాల్​పేట్​, బేగంపేట్​ పీఎస్ పరిధిల్లో  బైక్​లను చోరీ చేశారు. ఈనెల13న బేగంపేట్​లోని ఓ షాపింగ్​మాల్​వద్ద పార్క్​చేసిన జూపిటర్ బైక్  కనిపించడం లేదని స్మితాపాటిల్​అనే మహిళ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజీలను చెక్ చేశారు.

బేగంపేటలో బైక్ ను చోరీ చేసి చాంద్రాయణగుట్ట షాహిన్​నగర్​లో నంబర్ ప్లేటు మార్చి తిరుగుతున్నట్లు గుర్తించారు. ఆ బైక్ ను స్వాధీనం చేసుకుని చాసిస్​నంబరు ఆధారంగా పోలీసులు పరిశీలించారు.  అది బేగంపేట్​లో  చోరీకి గురైన జూపిటర్ బైక్ గా తెలిసింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ లను చోరీ చేసినట్టు చెప్పారు. షేక్​ ఇబ్రహీంను రిమాండ్​కు, బాలుడిని జువెనైల్​ హోమ్​కు పంపారు.