క్రీడలకు విద్యతో సమాన ప్రాధాన్యమివ్వాలి

క్రీడలకు విద్యతో సమాన ప్రాధాన్యమివ్వాలి

నవతరం తల్లిదండ్రులు పిల్లలను చదువుల పట్లనే కాక క్రీడల పట్ల ఆసక్తి పెంచేలా చూడాలని మాజీ మంత్రివర్యులు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు జి వినోద్ తెలిపారు. ప్రముఖ క్రికెటర్,హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ) మాజీ కార్యదర్శి ఎంవి శ్రీధర్ జ్ఞాపకార్థం టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 2019 ను ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ లో ప్రారంభించారు. హైదరాబాద్ డిస్టిక్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా ఎం వి శ్రీధర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌కు ముఖ్యఅతిథిగా హాజరైన  వినోద్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. ఎం వి శ్రీధర్ తో ఆయనకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని, తమ కుటుంబంలో ఒకడిగా మెలిగే వారన్నారు. శ్రీధర్ క్రీడలను అమితంగా అభిమానించేవాడని, క్రీడల అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశాడన్నారు. శ్రీధర్ జ్ఞాపకార్థం టేబుల్ టెన్నిస్ అకాడమీ స్థాపించేందుకు చొరవ తీసుకుంటానన్నారు. టేబుల్ టెన్నిస్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. క్రీడలను విద్యతో  సమానంగా భావిస్తూ ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులు ఆయనకు జ్ఞాపకను బహుకరించారు. తెలంగాణ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ గడ్డం వెంకటస్వామి సమాజం పట్ల సేవా భావంతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. ఆయన మన ఆత్మ గౌరవానికి, ఆత్మ విశ్వాసానికి ప్రతీక అని అభివర్ణించారు. హైదరాబాద్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహారావు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్

గురువారం నుంచి ఆదివారం వరకు జరుగనుందని  తెలిపారు. ఈ టోర్నమెంట్లో ఐదు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారని, గవర్నమెంట్ లో వివిధ విభాగాల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. ముఖ్యఅతిథిగా మాజీ మంత్రివర్యులు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు హాజరైన జి వినోద్, తెలంగాణ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారెడ్డి తో కలిసి టోర్నమెంట్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో దిపేశ్ పాల్గొన్నారు.

శ్రమించిన లాస్య

ఈ  టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌ మహిళల విభాగంలో చెమటోడ్చి నెగ్గిన లాస్య క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరింది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో లాస్య 4–3తో వినిచిత్రపై చెమటోడ్చి విజయం సాధించింది. మిగతా మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ప్రణీత 4–0తో హనీఫాపై, వరుణి జైస్వాల్‌‌‌‌‌‌‌‌ 4–0తో నిఖితపై, మోనిక 4–2తో రచనపై, సృష్టి 4–1తో కీర్తనపై, సస్యా 4–1తో నిఖితపై, రాగ నివేదిత 4–0తో ఇక్షితపై గెలుపొందారు. భవిత నుంచి దివ్యకు వాకోవర్‌‌‌‌‌‌‌‌ లభించింది. యూత్‌‌‌‌‌‌‌‌ బాలికల విభాగంలో కీర్తన, ప్రణీత, వరుణి, రాగ నివేదిత క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు. ప్రణీత 4–0తో యషికపై, వరుణి 4–0తో నిఖిత, రాగ నివేదిత 4–1తో దేవిశ్రీపై గెలుపొందరు. ఇక యూత్‌‌‌‌‌‌‌‌ బాలుర రెండోరౌండ్‌‌‌‌‌‌‌‌లో మహ్మద్‌‌‌‌‌‌‌‌ అలీ 3–0తో సాయి కిరణ్‌‌‌‌‌‌‌‌పై, విశాల్‌‌‌‌‌‌‌‌ 3–0 తో విధుర్‌‌‌‌‌‌‌‌పై, వత్సిన్‌‌‌‌‌‌‌‌ 3–1తో అనూప్‌‌‌‌‌‌‌‌పై విజయం సాధించారు. పురుషుల రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లో విశాల్‌‌‌‌‌‌‌‌ 4–1తో యాశ్‌‌‌‌‌‌‌‌పై, పీయూష్‌‌‌‌‌‌‌‌ 4–1తో సోమరాజ్‌‌‌‌‌‌‌‌పై, విగేయ్‌‌‌‌‌‌‌‌ 4–0తో అనిల్‌‌‌‌‌‌‌‌పై, సాయినాథ్‌‌‌‌‌‌‌‌ 4–2తో విశాల్‌‌‌‌‌‌‌‌పై, అమన్‌‌‌‌‌‌‌‌ 4–1తో మహేందర్‌‌‌‌‌‌‌‌పై, అలీ మహ్మద్‌‌‌‌‌‌‌‌  4–2తో హార్దిక్‌‌‌‌‌‌‌‌పై విజయం సాధించారు.